ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిద్దాం... | banned the use of plastic | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిద్దాం...

Jan 1 2017 10:38 PM | Updated on Sep 5 2017 12:08 AM

ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిద్దాం...

ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిద్దాం...

పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రజలు నిషేదిత ప్లాస్టిక్‌ వాడకాన్ని స్వచ్ఛందంగా మానేయాలని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, నగర మేయర్‌ కొంకటి లక్షీ్మనారాయణ పిలుపునిచ్చారు.

కోల్‌సిటీ : పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రజలు నిషేదిత ప్లాస్టిక్‌ వాడకాన్ని స్వచ్ఛందంగా మానేయాలని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, నగర మేయర్‌ కొంకటి లక్షీ్మనారాయణ పిలుపునిచ్చారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ నిషేదం వల్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో శనివారం ర్యాలీ చేపట్టారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గాంధీచౌక్‌ చౌరస్తా, లక్షీ్మనగర్‌ వ్యాపార కూడళ్లలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీచౌక్‌ చౌరస్తాలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్, నగర మేయర్‌ మాట్లాడారు. ప్లాస్టిక్‌ క్వారీ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా బట్టలతో తయారు చేసిన సంచులు, జూట్, కాగితం సంచులను ఉపయోగించాలని కోరారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్‌ను నివారించడానికి కృషి చేయాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ డి.జాన్ శ్యాంసన్ మాట్లాడుతూ 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని తెలిపారు.

అనుమతిలేని స్థలాల్లో ఫ్లెక్సీలుంటే తొలగించడంతోపాటు, జరిమానా కూడా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. నిషేధిత ప్లాస్టిక్‌ వాడకాన్ని విజయవంతం చేసేందుకు అందరి సహకారం కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్‌ సాగంటి శంకర్, కార్పొరేటర్లు నారాయణదాసు మారుతి, ముప్పిడి సత్యప్రసాద్, బొమ్మక శైలజ, నస్సీన్ బేగం, పెద్దెల్లి ప్రకాశ్, షేక్‌ బాబుమియా, చుక్కల శ్రీనివాస్, కుంట సాయితోపాటు నాయకులు మేకల సమ్మయ్య, దాసరి రవి, బొమ్మక రాజేష్, దాసరి సాంబమూర్తి, తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితి ప్రతినిధి శ్రీనివాస్, నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.శివయ్య, డెప్యూటీ ఈఈ మాధవి, శానిటరీ ఇన్ స్పెక్టర్‌ పవన్ కుమార్, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement