కార్మికుడిపై దౌర్జన్యం? | attack on road labour | Sakshi
Sakshi News home page

కార్మికుడిపై దౌర్జన్యం?

Jul 26 2016 5:18 PM | Updated on Aug 30 2018 5:49 PM

కార్మికుడిపై దౌర్జన్యం? - Sakshi

కార్మికుడిపై దౌర్జన్యం?

గోశాల వద్ద రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న ఓ కార్మికుడిపై ప్రజాప్రతినిధి ఒకరు చెయ్యిSచేసుకున్న ఘటన అర్జునవీధిలో జరిగింది. దీంతో తోటి కార్మికులు సోమవారం పనులను నిలిపివేయడంతో దుర్గగుడి అధికారులు వారితో చర్చలు జరిపారు. సేకరించిన వివరాల ప్రకారం అర్జునవీధి వంద అడుగుల విస్తరణ పనులు జరుగుతున్నాయి.

సాక్షి, విజయవాడ :
గోశాల వద్ద రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న ఓ కార్మికుడిపై ప్రజాప్రతినిధి ఒకరు చెయ్యిSచేసుకున్న ఘటన అర్జునవీధిలో జరిగింది. దీంతో తోటి కార్మికులు సోమవారం పనులను నిలిపివేయడంతో దుర్గగుడి అధికారులు వారితో చర్చలు జరిపారు. సేకరించిన వివరాల ప్రకారం అర్జునవీధి వంద అడుగుల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం సమయంలో ఓ కార్మికుడు రోడ్డుపై డ్రిల్లింగ్‌ చేస్తున్న సమయంలో గోశాలకు సమీపంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో సామగ్రి అదరడమే కాకుండా గ్లాస్‌ తలుపులు బీటలు వారాయి. దీంతో ఆగ్రహించిన ఆయన ఊగిపోతూ మేడపై నుంచి కిందకు వచ్చి ఆ కార్మికుడిపై చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. దీంతో సదరు కార్మికుడిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న తోటి కార్మికులు  దుర్గగుడి అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
సోమవారం ప్రజా ప్రతినిధిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కార్మికులు సిద్ధం కావడంతో అనవసర గొడవ ఎందుకంటూ  దుర్గగుడి అధికారులు రాజీ చేసినట్లు సమాచారం. ఇటీవల అర్జునవీధి విస్తరణలో తన నివాసాన్ని కాపాడుకునేందుకు  ప్రయత్నించిన ఆ ప్రజాప్రతినిధి ఇప్పుడు  కార్మికుడిపై చెయ్యి చేసుకోవడం ఎంత వరకు సబబని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement