కృత్రిమ కాళ్లు, చేతుల కోసం దరఖాస్తుల ఆహ్వానం | Artificial legs, arms, applications for the invitation | Sakshi
Sakshi News home page

కృత్రిమ కాళ్లు, చేతుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Dec 15 2016 11:30 PM | Updated on Jun 1 2018 8:39 PM

భారత్‌ వికాస్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయనున్న కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్‌ కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని అమృత వర్షిణి బాల కళ్యాణ ఆశ్రమం (అనాథ శరణాలయం) కార్యదర్శి కె.లింగప్ప, క్యాంప్‌ ఆర్గనైజర్లు ఇల్లూరు లక్ష్మినారాయణ, డాక్టర్‌ రామ్మూర్తి కోరారు.

గుంతకల్లు టౌన్‌:

భారత్‌ వికాస్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయనున్న కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్‌ కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని అమృత వర్షిణి బాల కళ్యాణ ఆశ్రమం (అనాథ శరణాలయం) కార్యదర్శి కె.లింగప్ప, క్యాంప్‌ ఆర్గనైజర్లు ఇల్లూరు లక్ష్మినారాయణ, డాక్టర్‌ రామ్మూర్తి కోరారు.  శరణాలయంలో గురువారం  వారు విలేకరులతో మాట్లాడారు.  జైపూర్‌ కంపెనీ కంటే నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్‌ను ఉచితంగా అందజేస్తామన్నారు. అవసరమైన వారు ఈ నెల 25  మధ్యాహ్నం 3 గంటలకు శరణాలయంలో హాజరైతే కొలతలు తీసుకుంటారని చెప్పారు. జనవరి 12న    కృత్రిమ అవయవాలను  అందజేస్తామన్నారు. ఇతర వివరాల కోసం తిలక్‌నగర్‌లోని అనాథ శరణాలయం లేదా ఇల్లూరు లక్ష్మినారాయణ భవన్‌లో సంప్రదించాలని   విజ్ఞప్తి చేశారు.  శరణాలయం కమిటీ సహాయ కార్యదర్శి గిరిధర్‌ రెడ్డి, సభ్యులు  పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement