బస్ పాసుల జారీ ఇక ఆన్‌లైన్‌లోనే... | Apply Online for Student Bus Passes . | Sakshi
Sakshi News home page

బస్ పాసుల జారీ ఇక ఆన్‌లైన్‌లోనే...

Jun 20 2016 8:07 PM | Updated on Sep 4 2018 5:21 PM

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు బస్సుపాసులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని డిపో మేనేజర్ హేమంత్‌రావు తెలిపారు.

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు బస్సుపాసులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని డిపో మేనేజర్ హేమంత్‌రావు తెలిపారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సిటీ జనరల్, సిటీ స్పెషల్, గ్రేటర్ హైదరాబాద్ పాసులు ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనున్నట్లు చెప్పారు. డిస్ట్రిక్ట్, రూట్ పాసులను కూడాఆన్‌లైన్‌లోనే జారీకి నూతన సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వారం రోజుల్లో డిస్ట్రిక్, రూట్ పాసులు కూడా ఆన్‌లైన్ ద్వారా అందజేస్తామన్నారు. విద్యార్థులు సహకరించాలని సూచించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement