తిరుపతి టీడీపీ మహానాడు నేపథ్యంలో ఏపీ మంత్రులు తిరుమలకు క్యూ కట్టారు.
తిరుపతి టీడీపీ మహానాడు నేపథ్యంలో ఏపీ మంత్రులు తిరుమలకు క్యూ కట్టారు. అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు శ్రీవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, కె. మృణాళిని శుక్రవారం ఉదయంవీఐపీ విరామ సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. అలాగే, ఎంపీలు ఎం.శ్రీనివాస్, రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, డోల వీరాంజనేయస్వామి తదితరులు కూడా స్వామి దర్శనం చేసుకున్నారు.