భగీరథ తవ్వకాల్లో పురాతన వస్తువులు | Antiques excavation in Mission Bhagiratha project | Sakshi
Sakshi News home page

భగీరథ తవ్వకాల్లో పురాతన వస్తువులు

May 24 2017 1:54 PM | Updated on Sep 5 2017 11:54 AM

భగీరథ తవ్వకాల్లో పురాతన వస్తువులు

భగీరథ తవ్వకాల్లో పురాతన వస్తువులు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో మిషన్‌ భగీరథ పైపులైను తవ్వకాల్లో గుప్త నిధులు బయట పడ్డాయి.

► గుప్త నిధులుగా ప్రచారం

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో మిషన్‌ భగీరథ పైపులైను తవ్వకాల్లో గుప్త నిధులు బయట పడ్డాయన్న ప్రచారం మండలంలో దాహనంలా వ్యాపించింది. వాటిని చూసేందుకు ప్రజలు తండోప తండాలుగా వచ్చారు. పైపులైన్‌ తవ్వకాలు జరుగుతుండగా మంగళవారం గ్రామంలోని బస్టాండ్‌ çవద్ద పురాతన కాలం నాటి రాగి కూజ, చెంబు, పాత్రలు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలియడంతో  రఘునాథపల్లి ఎస్సై రంజిత్‌రావు వచ్చి ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

అయితే వాటిలో గుప్త నిధులు లభ్యమయ్యాయా.? బయటపడిన సమయంలో వాటిని ఎవరైనా తీసుకున్నారా? అన్న  అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఇదే ప్రాంతంలో గతంలో గుప్త నిధులు లభ్యమైనట్లు గ్రామస్తులు చర్చించుకోవడం గమనార్హం. ఈ విషయమై తహసీల్దార్‌ రవిచంద్రారెడ్డిని వివరణ కోరగా తమకు ఆలస్యంగా సమాచారం అందిందని తమ వీఆర్వో శ్రీహరిని స్వాధీనం చేసుకోమని పంపగా అప్పటికే ఎస్సై తీసుకెళ్లినట్లు తెలిసిందన్నారు. పాత కాలం నాటి రాగి చెంబు, పాత్రలు మాత్రమే ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. వాటిని బుధవారం పురావస్తు శాఖకు అప్పగిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement