సర్పరూపునికి అన్నాభిషేకం | annabhishekam of subramanyeswara | Sakshi
Sakshi News home page

సర్పరూపునికి అన్నాభిషేకం

Aug 13 2017 10:29 PM | Updated on Sep 17 2017 5:29 PM

సర్పరూపునికి అన్నాభిషేకం

సర్పరూపునికి అన్నాభిషేకం

సర్వపాపాల హరుడు సర్పరూప సుబ్రమణ్యేశ్వరస్వామి వారికి శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్నాభిషేకం నిర్వహించారు.

ఆత్మకూరు: సర్వపాపాల హరుడు సర్పరూప సుబ్రమణ్యేశ్వరస్వామి వారికి శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్నాభిషేకం నిర్వహించారు. మొదటగా అన్నం వద్ద పూజలు నిర్వహించి అనంతరం మేళతాళాలతో ఆలయ ప్రధాన అర్చకులు రాము శాస్త్రి అన్నాన్ని తన శిరస్సుపై ఉంచుకొని సుబ్రమణ్యేశ్వర మూలవిరాట్‌ వద్దకు వచ్చారు.

అదేవిధంగా ఆలయంలో కొలువైన మంజునాథస్వామికి కూడా అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలతో పాటు విశేష పూజలు చేశారు. రాహ/కేతు హోమాలు, రథాన్ని ఆలయం చుట్టూ తిప్పడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బ్రాహ్మణులకు ప్రత్యేకంగా సంప్రదాయ ప్రకారం భోజన కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement