breaking news
annabhishekam
-
సర్పరూపునికి అన్నాభిషేకం
ఆత్మకూరు: సర్వపాపాల హరుడు సర్పరూప సుబ్రమణ్యేశ్వరస్వామి వారికి శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్నాభిషేకం నిర్వహించారు. మొదటగా అన్నం వద్ద పూజలు నిర్వహించి అనంతరం మేళతాళాలతో ఆలయ ప్రధాన అర్చకులు రాము శాస్త్రి అన్నాన్ని తన శిరస్సుపై ఉంచుకొని సుబ్రమణ్యేశ్వర మూలవిరాట్ వద్దకు వచ్చారు. అదేవిధంగా ఆలయంలో కొలువైన మంజునాథస్వామికి కూడా అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలతో పాటు విశేష పూజలు చేశారు. రాహ/కేతు హోమాలు, రథాన్ని ఆలయం చుట్టూ తిప్పడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బ్రాహ్మణులకు ప్రత్యేకంగా సంప్రదాయ ప్రకారం భోజన కార్యక్రమాలు నిర్వహించారు. -
7న శ్రీశైలంలో కుంభోత్సవం
కర్నూలు: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబాదేవికి మంగళవారం వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత అమ్మవారికి సాత్విక బలి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశిని సమర్పిస్తారు. అదే రోజు సాయంత్రం శ్రీ మల్లికార్జునస్వామివారికి ప్రదోషకాల పూజలు నిర్వహించిన అనంతరం అన్నాభిషేకంతో లింగాన్ని కప్పివేసి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. సాయంత్రం స్వామివారి దర్శనం ఉండదు. అమ్మవారి ఆలయంలో సింహమండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా పోస్తారు. సాంప్రదాయానుసారం స్త్రీ వేషంలోని పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పిస్తారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనార్థం భక్తులను అనుమతిస్తారు. కుంభోత్సవం సందర్భంగా క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులను నిషేధించినట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు. ఎవరైనా ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే మూడు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు దేవాదాయ చట్ట ప్రకారం జరిమానా విధించబడుతుందన్నారు.