సత్తా చాటిన ఆంధ్రజట్టు | andhra team won juniors tourny | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన ఆంధ్రజట్టు

Apr 28 2017 11:00 PM | Updated on Jun 2 2018 5:38 PM

సత్తా చాటిన ఆంధ్రజట్టు - Sakshi

సత్తా చాటిన ఆంధ్రజట్టు

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరుగుతున్న 7వ మహిళా జాతీయ జూనియర్స్‌ టోర్నీ రెండో మ్యాచ్‌లో విదర్భపై ఆంధ్ర హాకీ జట్టు ఘనవిజయం సాధించింది.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరుగుతున్న 7వ మహిళా జాతీయ జూనియర్స్‌ టోర్నీ రెండో మ్యాచ్‌లో విదర్భపై ఆంధ్ర హాకీ జట్టు ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో విదర్భతో తలపడి 15–0 తేడాతో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. ఆంధ్ర జట్టులో అనంత క్రీడాకారిణి మహేశ్వరి 6 గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

క్రీడాకారిణులు మేరీ–5, స్పందన–2, భవాని–1, జ్యోతి–1 గోల్స్‌తో అలరించారు. ఈ సందర్భంగా ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ క్రీడాకారులను, హాకీ కోచ్‌ అనిల్‌కుమార్‌ను అభినందించారు. జాతీయస్థాయి టోర్నీలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఆదివారం ఆంధ్ర జట్టు పాండిచ్చేరితో తలపడనుందని కోచ్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement