తమిళనాడులో సంభవించిన వరదలలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ వాసి మృతిచెందారు.
చెన్నై: తమిళనాడులో సంభవించిన వరదలలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ వాసి మృతిచెందారు. అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన నారాయణ చెన్నైలో నివాసం ఉండేవారు. చెన్నైలో ఆంధ్రాబ్యాంకు మేనేజర్గా విధులు నిర్వహించేవారు. చెన్నైలో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురిసి సంభవించిన వరదలలో ఆయన మృతిచెందారని చెన్నై అధికారులు నారాయణ కుటుంబానికి శుక్రవారం సాయంత్రం సమాచారం అందించారు. తమిళనాడులో వరదల వల్ల సుమారు 325కు పైగా మంది మృతిచెందారు.