చంద్రబాబు రాయలసీయ ద్రోహిగా మారారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు.
'చంద్రబాబు రాయలసీమ ద్రోహి'
Feb 7 2017 3:15 PM | Updated on Jul 28 2018 3:33 PM
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లుగా కృష్ణా జలాలు అనంతపురానికి వస్తున్నా.. ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరివ్వలేదని విమర్శించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మారారని ఆయన ధ్వజమెత్తారు.
హంద్రీనీవాపై బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమా అని మంగళవారం అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. అనంతపురం మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు, కోడుకు, మనవడికి భజన చేసేందుకే ఉన్నారంటూ ఆయన విమర్శించారు.
Advertisement
Advertisement