కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, సిరిసిల్ల పట్టణాల్లో బంద్ కొనసాగుతోంది.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, సిరిసిల్ల పట్టణాల్లో బంద్ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలోనే హుస్నాబాద్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఉదయం నుంచే ఆయా పార్టీల నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు బయటకు రాలేదు. అదేవిధంగా సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో సిరిసిల్ల బంద్ కొనసాగుతోంది. అఖిలపక్షాల నాయకుల ధర్నాతో ఉదయం నుంచి డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు.