breaking news
All party bandh
-
సిద్దిపేట వద్దు..కరీంనగర్ ముద్దు
కోహెడలో అఖిలపక్షం బంద్ సంపూర్ణం కోహెడ : కోహెడ మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన కోహెడ బంద్ సంపూర్ణమైంది. మండల కేంద్రంలో కిరాణం దుకాణాల వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను అఖిలపక్షం నాయకులు బహిష్కరించారు. ప్యాసెంజర్, ట్రాలీ ఆటో యజమానులు బంద్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులు ర్యాలీ తీశారు. అంబేద్కర్‌చౌరస్తాలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, అఖిలపక్షం నాయకులు కర్ర రవీందర్, ఖమ్మం వెంకటేశం, సంది శ్రీనివాస్‌రెడ్డి, బందెల బాలకిషన్, కోటేశ్వరాచారి, గవ్వ వంశీధర్‌రెడ్డి, అన్నబోయిన కనకయ్య, వలుస సుభాష్, గాజుల వెంకటేశ్వర్లు, మ్యాకల బాలకిషన్‌రెడ్డి, శెట్టి సుధాకర్, బస్వారాజు శంకర్, ఇట్టిరెడ్డి నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సిరిసిల్ల, హుస్నాబాద్ బంద్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, సిరిసిల్ల పట్టణాల్లో బంద్ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలోనే హుస్నాబాద్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఉదయం నుంచే ఆయా పార్టీల నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు బయటకు రాలేదు. అదేవిధంగా సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో సిరిసిల్ల బంద్ కొనసాగుతోంది. అఖిలపక్షాల నాయకుల ధర్నాతో ఉదయం నుంచి డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు.