హోరాహోరీగా ఫైనల్‌ పోరు | all India sub juniors badminton tournament ends | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ఫైనల్‌ పోరు

Nov 13 2016 10:36 PM | Updated on Sep 4 2017 8:01 PM

హోరాహోరీగా ఫైనల్‌ పోరు

హోరాహోరీగా ఫైనల్‌ పోరు

స్థానిక ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆల్‌ ఇండియా సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బాడ్మింటన్‌ పోటీలు ఆదివారం ముగిశాయి.

- ముగిసిన ఆల్‌ ఇండియా సబ్‌ జూనియర్‌ బాడ్మింటన్‌ పోటీలు
- విజేతలకు ట్రోఫీలు ప్రదానం
 
కర్నూలు (టౌన్‌):  స్థానిక ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆల్‌ ఇండియా సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బాడ్మింటన్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు పోటీలు హోరాహోరిగా సాగాయి. ఫైనల్‌ పోరులో క్రీడాకారులు విజయం కోసం నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ఈ నెల 7 నుంచి నగరంలోని ఇండోర్‌స్టేడియం, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల ఇండోర్‌ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించారు. అండర్‌ -15 బాలుర విభాగంలో ఏపీకి చెందిన సాయిచరణ్‌ కోయా విన్నర్‌గా నిలిచారు. ఫైనల్స్‌లో ఆయన ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన అయూష్‌ రాజ్‌ గుప్తపై 21=16, 21–13 పాయింట్లతో విజయం సాధించారు. అండర్‌-13 బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన మేఘనారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనుపమ ఉపాధ్యాయపై, డబుల్స్‌ విభాగంలో మేఘనారెడ్డి (తెలంగాణ), తస్నీమ్‌ మీర్‌ (గుజరాత్‌).. శ్రేయా చిత్తూరు (తెలంగాణ), ప్రవీణా (తమిళనాడు)పై గెలిచారు. అండర్‌-13 బాలుర విభాగంలో శంకర్‌ ముత్తుస్వామి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆకాష్‌ సింగ్‌పై, డబుల్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీక్రిష్ణ రాజ్, ఉనీత్‌ క్రిష్ణ తెలంగాణకు చెందిన సాతా„Š సింగ్‌ (ఢిల్లీ), సాయి సత్య సర్వేష్‌ యాకలా (పంజాబ్‌)పై గెలిచారు. అండర్‌ -15 బాలికల సింగిల్స్‌లో రిచా ముక్తిభోద్‌ (కర్ణాటక) మేధా శశిధరణ్‌ (కర్ణాటక)పై, డబుల్స్‌లో తెలంగాణకు చెందిన కేయూరా మోపతి, పంజాబ్‌కు చెందిన కవిప్రియాలు కర్ణాటకకు చెందిన తన్య హేమంత్, కీర్తన షరాఫ్‌పై గెలిచారు. డబుల్స్‌ బాలుర విభాగంలో ఎడ్విన్‌ జాయి, ఆరవింద్‌ వి. సురేష్‌ (కేరళ) బైద్యసాగర్‌ సలామ్, పున్షిభ ఎంగోమ్‌ (మణిపూర్‌)పై గెలిచారు. 
 
విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు ప్రదానం
ముగింపు కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌,   ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, ఎస్పీ ఆకె. రవికృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్, డీఎస్‌డీఓ మల్లిఖార్జున, ఇండియన్‌ బాడ్మింటన్‌  అసోసియేషన్‌ కార్యదర్శి పున్నయ్య చౌదరి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి శ్రీనివాసభట్, కోశాధికారి డాక్టర్‌ రవికళాధర్‌ రెడ్డి హాజరయ్యారు. టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన  క్రీడాకారులకు ట్రోఫిలు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.  
 
జాతీయస్థాయి గెలుపు ఆనందంగా ఉంది: సాయి చరణ్‌ కోయా                                                             
 గుంటూరుకు చెందిన సాయి చరణ్‌ హైదరబాదులో ఐడియల్‌ గ్రామర్‌స్కూలులో 10 వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా హైదరబాదు బోంగులూరులోని భాస్కర్‌బాబు లీనింగ్‌ బాడ్మింటన్‌ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు.  జాతీయస్థాయిలో గెలుపొందడం ఆనందంగా ఉందని తెలిపాడు. విన్నర్‌గా రాణించడం వెనుక కోచ్‌ బాస్కర్‌బాబు కృషి ఉన్నట్లు పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement