కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పలు శాఖల విభజనకు సంబంధించి సమాచారం అధికారులు కోరినవి ధంగా అందజేసేందుకు ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని నియమించారు.
అన్ని శాఖలకు నోడల్ అధికారులు
Sep 3 2016 12:28 AM | Updated on Oct 17 2018 3:38 PM
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పలు శాఖల విభజనకు సంబంధించి సమాచారం అధికారులు కోరినవి ధంగా అందజేసేందుకు ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని నియమించారు. వీరు ఆయా శాఖల్లోని పాత ఫైళ్లు ఒక్కో జిల్లా కు ఒక కాపీ చొప్పున జిరాక్స్ తీయించడం, స్కానింగ్ కాపీని భద్రపరచడం, కీలకమైన కోర్టు కేసుల ఫైళ్ల వివరాలు ప్రత్యేకం గా నమోదు చేసుకోవడం, అవసరమైన ఫైళ్లు డివిజన్లు, మండలాలకు పంపిణీ చేసేలా పనులు చేయించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా నియమించిన ఇద్దరు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఎస్‌వో కృష్ణవేణి, సహకార అడిట్ అధికారి కరుణాకర్‌కు నోడల్ అధికారులు అందజేయాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement