మద్యానికి భార్య డబ్బులివ్వలేదని ఓ తాగుబోతు ఆత్మహత్య చేసుకున్నాడు.
మద్యానికి భార్య డబ్బులివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ తాగుబోతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతి శాంతినగర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గడ్డం నాగులు(58) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతండేవి. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నాగులు తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.