పుష్కరాలకు రూ.860 కోట్లు | 860 crores to Krishna Pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు రూ.860 కోట్లు

Aug 12 2016 11:18 PM | Updated on Sep 4 2017 9:00 AM

మునగమాన్‌దిన్నె ఘాట్‌ను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మునగమాన్‌దిన్నె ఘాట్‌ను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మునగమాన్‌దిన్నె ఘాట్‌ : కష్ణా పుష్కరాలకు ప్రభుత్వం రూ.860 కోట్లు కేటాయించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

మునగమాన్‌దిన్నె ఘాట్‌ : కష్ణా పుష్కరాలకు ప్రభుత్వం రూ.860 కోట్లు కేటాయించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ నిధులతో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్లలో అన్ని వసతులు కల్పించామన్నారు. శుక్రవారం పుష్కరాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మునగమాన్‌దిన్నె ఘాట్‌ను సందర్శించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తదుపరి ప్రజలు మొదటిసారి పుష్కరాల్లో సంతోషంగా పాల్గొంటున్నారన్నారు. సుమారు 500మంది ఉద్యోగులను ఇక్కడ నియమించి ప్రజలకు ఎలాంటి లోటులేకుండా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో వ్యవసాయ పనులు సాగుతున్నందున రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గౌని బుచ్చారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గోవిందునాయుడు, పీఎసీఎస్‌ అధ్యక్షుడు కోదండరామిరెడ్డి, వనపర్తి కౌన్సిలర్‌ వాకిటి శ్రీధర్, టీఆర్‌ఎస్‌ నాయకుడు బీచుపల్లియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement