ఏడుగురిపై క్రిమినల్‌ కేసులు | 7members police case | Sakshi
Sakshi News home page

ఏడుగురిపై క్రిమినల్‌ కేసులు

Aug 27 2016 8:09 PM | Updated on Aug 21 2018 6:21 PM

ఎంఎస్‌ పాయింట్‌ నుంచి రేషన్‌ షాపులకు చేరాల్సిన బియ్యాన్ని రైసు మిల్లుకు తరలించిన సంఘటనలో విజిలెన్స్‌ అధికారుల ఆదేశాల మేరకు కాకినాడ తిమ్మాపురం పోలీసులు ఏడుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు

సామర్లకోట :
ఎంఎస్‌ పాయింట్‌ నుంచి రేషన్‌ షాపులకు చేరాల్సిన బియ్యాన్ని రైసు మిల్లుకు తరలించిన సంఘటనలో విజిలెన్స్‌ అధికారుల ఆదేశాల మేరకు కాకినాడ తిమ్మాపురం పోలీసులు ఏడుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.  రైసుమిల్లు యజమాని బత్పల శ్రీవిష్ణు సూర్యతిరుపతిరావు, ఇద్దరు ట్రాక్టరు డ్రైవర్లు కేశమూరి సత్తిబాబు, గుండా బత్తుల రాఘవ, రూట్‌ సిబ్బంది (వీఆర్‌ఏ) పలివెల అబ్బు, గోదాముల గుమస్తా కేతా సాయిరామకృష్ణ, రవాణా కాంట్రాక్టర్‌ అడ్డూరి సత్యనారాయణ, కాంట్రాక్టరు గుమాస్తా కొటికెలపూడి శ్రీరామచంద్రమూర్తిపై  సివిల్‌ సప్లయీస్‌ ఏఎస్‌ఓ పీతల సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు ఎస్సై జీవీవీ సత్యనారాయణ తెలిపారు. కాగా ఈ సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ఎల్‌.శివకుమార్‌ తెలిపారు. వీఆర్‌ఏను విచారణ చేసి, దీని వెనుక ఉన్న వారిని గుర్తిస్తామని చెప్పారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement