ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనని నిరసిస్తూ ప్రత్యేక హోదా ఇవాలనే డిమాండ్‌తో శనివారం నిర్వహించిన జిల్లా బంద్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో 778 మంది సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం అర్బన్ : ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనని నిరసిస్తూ ప్రత్యేక హోదా ఇవాలనే డిమాండ్‌తో శనివారం నిర్వహించిన జిల్లా బంద్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో 778 మంది సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్న ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేసేందుకు సిద్ధపడిందన్నారు. అందులో భాగంగా పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాలరాచి అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.