ఖమ్మంలో 650 డెంగ్యూ కేసులు | 650 dengue cases reported in khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో 650 డెంగ్యూ కేసులు

Oct 5 2016 5:51 PM | Updated on Sep 4 2017 4:17 PM

పారిశుద్ధ్యలోపంతోనే ఈ ఏడాది ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా 650 డెంగీ కేసులు నమోదయ్యయని డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు అన్నారు.

► డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు
బోనకల్‌ (ఖమ్మం జిల్లా): పారిశుద్ధ్యలోపంతోనే ఈ ఏడాది ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా 650 డెంగీ కేసులు నమోదయ్యయని డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు అన్నారు. ఖమ్మం శ్రీరక్ష ఆసుపత్రి, లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 650 డెంగీ కేసులో నమోదు కాగా అత్యధికంగా జోనకల్‌ మండలంలోనే ఉన్నాయన్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్‌ దృష్టిఅంతా బోనకల్‌ మండలంపైనే ఉందన్నారు. పారిశుద్ధ్య లోపంవల్లే విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement