500 దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం | 500 temples constructions | Sakshi
Sakshi News home page

500 దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం

Dec 23 2016 11:35 PM | Updated on Mar 19 2019 6:19 PM

రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ నిధులతో 500 దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు సమరసత సేవా ఫౌండేష¯ŒS రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఎం.సాయిరామ్‌ తెలిపారు. భవిష్యత్‌లో నిర్మించబోయే నూతన దేవాలయాల అంశంపై అడ్డతీగలలోని పవనగిరిక్షేత్రంలో గురువారం

అడ్డతీగల : 
రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ నిధులతో 500 దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు సమరసత సేవా ఫౌండేష¯ŒS రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఎం.సాయిరామ్‌ తెలిపారు. భవిష్యత్‌లో నిర్మించబోయే నూతన దేవాలయాల అంశంపై అడ్డతీగలలోని పవనగిరిక్షేత్రంలో గురువారం సమావేశం నిర్వహించారు. హిందూధర్మపరిరక్షణట్రస్ట్‌ జిల్లా కన్వీనర్‌ తణుకువెంకటరామయ్య ఆద్వర్యంలో సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో పాల్గొన్న  సాయిరామ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని నిర్ణయించారన్నారు. ఎక్కడ ఏ దేవుడి ఆలయం కావాలంటే అది నిర్మించేలా చర్యలు తీసుకోవడానికి 13 జిల్లాల్లో హిందూధర్మ పరిరక్షణ  ప్రచార కన్వీనర్లను నియమించామన్నారు.తూర్పుగోదావరిజిల్లాకు తణుకు వెంకటరామయ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. ఆలయం కావాలనుకునేవారు కమిటీగా ఏర్పడి సంయుక్త బ్యాంక్‌ఖాతా ప్రారంభించి టీటీడీ అందించే దరఖాస్తు పూర్తిచేసి ఇస్తే తాము వాటిని పరిశీలించి టీటీడీకి సమర్పిస్తామన్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి ఏజెన్సీ నుంచి 50 దరఖాస్తులు అందాయన్నారు. అడ్డతీగల మండలం రేగులపాడు, సోమన్నపాలెం గ్రామాల్లో ఒక్కొక్కటి రూ.5 లక్షల అంచనా వ్యయంతో దేవాలయాలు నిర్మాణానికి ఆమోదం వచ్చిందన్నారు.సంయుక్త ఖాతాకి ఆరు విడతలుగా నిధులు విడుదల చేస్తారని సమరసత సేవా ఫౌండేష¯ŒS జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ అన్నారు. మండలాల వారీగా హిందూధర్మపరిరక్షణ ప్రచార కన్వినర్లను నియమించారు. గిరిజన అర్చకులు, పలువురు ధార్మికసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement