క్యారీబ్యాగ్స్‌పై నిషేధం | ధం, 50 మైక్రాన్లు carrybags prohibited | Sakshi
Sakshi News home page

క్యారీబ్యాగ్స్‌పై నిషేధం

Published Sun, Aug 7 2016 10:18 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

క్యారీబ్యాగ్స్‌పై నిషేధం

విజయవాడ సెంట్రల్‌ : 
పర్యావరణం దృష్ట్యా నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్స్‌ను నిషేధించినట్లు కమిషనర్‌ జి.వీరపాండియన్‌ చెప్పారు. ప్లాస్టిక్‌ కవర్ల వల్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయన్నారు. షాపుల యజమానులు, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజారోగ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. నగరంలో పశువులు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్లపై కనిపించే పశువుల్ని బందిలిదొడ్డికి తరలిస్తామని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement