breaking news
carrybag
-
కళ్లకింద క్యారీబ్యాగులు ఉండకూడదంటే..!
కొందరికి కళ్ల కింద చర్మం క్యారీబ్యాగుల్లా వదులొదులుగా ఉబ్బిపోయినట్లు ఉంటుంది. నిద్రలేమి సహా రకరకాల సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ముఖంలో చూడగానే ఆకట్టుకునేవి కళ్లే! అలాంటి కళ్ల కింద క్యారీబ్యాగులు ఏర్పడితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది! వీటిని తొలగించుకోవడానికి చాలామంది నానా తంటాలు పడుతుంటారు. ఇంటి చిట్కాలతో అంత సులువుగా మాయమయ్యే సమస్య కాదిది. అయితే, ‘థెరాఫేస్ డీపఫింగ్ వాండ్’ చేతిలో ఉంటే చాలు, కళ్ల కింద క్యారీబ్యాగులను ఇట్టే మటుమాయం చేసుకోవచ్చు. ఇది మూడు మోడ్లతో పనిచేస్తుంది. ఇందులోని కూలింగ్ మోడ్ అలసిన కళ్లకు విశ్రాంతినిచ్చి, చర్మరంధ్రాలను సంకోచింపజేస్తుంది. హీటింగ్ మోడ్ కళ్ల చుట్టూ ఉండే చర్మంలో రక్తప్రసరణను ఉత్తేజపరుస్తుంది. కాంట్రాస్ట్ మోడ్ చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. అన్ని రకాల చర్మతత్త్వాల వారికి ఈ పరికరం అనుకూలంగా ఉంటుంది.తడిసినా సమస్యలేదిక!వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు జుట్టును పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షంలో తడిస్తే వెంటనే మైల్డ్, సల్ఫేట్–ఫ్రీ షాంపూతో తలస్నానం చేయాలి. తడి జుట్టును అస్సలు ముడివేయవద్దు. తేమ ఉన్నట్లయితే కుదుళ్ళు బలహీనపడతాయి. జుట్టును గాలికి సహజంగా ఆరనివ్వాలి. జుట్టు చిక్కులు తీయడానికి వెడల్పాటి పళ్ళున్న దువ్వెనను ఉపయోగించాలి. వారానికి రెండు మూడుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి, లేదంటే జుట్టు నిర్జీవంగా మారుతుంది. శరీరంలో పోషకాల లోపం వల్ల కూడా వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, బాదం వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల కుదుళ్ళు తేమగా, బలంగా ఉంటాయి. దువ్వెనలు, పిల్లో కవర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.స్నానానికి గాడిద పాలుఈజిప్టు రాణి క్లియోపాత్రా తన చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు గాడిద పాలతో స్నానం చేసేది. ఆమె ఒక స్నానానికి కావలసిన పాల కోసం దాదాపు 700 గాడిదలను పోషించేవారు. ఆమె తన ప్రయాణాలలో కూడా గాడిదలను తీసుకువెళ్లేది. ఈ పాలలోని ‘లాక్టిక్ యాసిడ్’ చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మం లోపలి పొరల నుంచి తేమను అందించి హైడ్రేటెడ్‌గా ఉంచడంలో తోడ్పడుతుంది. -
క్యారీబ్యాగ్స్‌పై నిషేధం
విజయవాడ సెంట్రల్ : పర్యావరణం దృష్ట్యా నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను నిషేధించినట్లు కమిషనర్ జి.వీరపాండియన్ చెప్పారు. ప్లాస్టిక్ కవర్ల వల్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయన్నారు. షాపుల యజమానులు, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజారోగ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. నగరంలో పశువులు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్లపై కనిపించే పశువుల్ని బందిలిదొడ్డికి తరలిస్తామని హెచ్చరించారు.


