జిల్లాలో 3,340 పంట కోత ప్రయోగాలు | 3340 paady reasearch jd prasad | Sakshi
Sakshi News home page

జిల్లాలో 3,340 పంట కోత ప్రయోగాలు

Nov 9 2016 11:01 PM | Updated on Sep 4 2017 7:39 PM

జిల్లాలో 3,340 పంట కోత ప్రయోగాలు

జిల్లాలో 3,340 పంట కోత ప్రయోగాలు

రాయవరం : ఖరీఫ్‌లో 2.20 లక్షల హెక్టార్లలో రైతులు వరిసాగు చేపట్టగా 13.22 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ కేవీవీ ప్రసాద్‌ తెలిపారు. రాయవరం మండలం సోమేశ్వరంలో పంట కోత ప్రయోగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ ప్రసాద్‌ మాట్లాడుతూ 3,340 పంట కోత ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 549

ఖరీఫ్‌లో 13.22లక్షల మెట్రిక్‌క్ష టన్నుల ధాన్యం దిగుబడి
రబీలో నూరు శాతం వెదజల్లు సాగును ప్రోత్సహిస్తాం
వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్‌
రాయవరం : ఖరీఫ్‌లో 2.20 లక్షల హెక్టార్లలో రైతులు వరిసాగు చేపట్టగా 13.22 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ కేవీవీ ప్రసాద్‌ తెలిపారు. రాయవరం మండలం సోమేశ్వరంలో పంట కోత ప్రయోగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ ప్రసాద్‌ మాట్లాడుతూ 3,340 పంట కోత ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 549 పూర్తి చేశామన్నారు. ఎకరాకు 32 నుంచి 38 బస్తాల దిగుబడి వస్తుందన్నారు. ఇది పెరిగే అవకాశం ఉందన్నారు. రబీలో తక్కువ కాలపరిమితి పంటలైన ఎంటీయూ 3626 (బొండాలు), విజేత 1001, కాటన్‌ దొర సన్నాలు 1110 తదితర రకాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో అపరాల సాగు చేయడం లక్ష్యంకాగా, 50 శాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేస్తామన్నారు.
రూ.24కోట్లు మంజూరైంది...
ఆర్‌కేవీవై, ఎస్‌ఎంఏఎం, ఎస్‌ఏపీ తదితర పథకాల ద్వారా అన్ని రకాల యాంత్రికీకరణ పనిముట్లు రైతులకు అందజేసేందుకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ. 24 కోట్లు మంజూరైందన్నారు. మెట్ట ప్రాంతమైన తుని, తొండంగి, జగ్గంపేట, ఏలేశ్వరం, కోరుకొండ తదితర 10 క్లస్టర్లలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసినట్లు తెలిపారు. సమావేశంలో చీఫ్‌ ప్లానింగ్‌ కార్యాలయం డీడీ ఎ.ఉదయభాస్కర్, ఎంఎస్‌వో గాయిత్రిదేవి, ఏవో ఎం.అరుణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement