దుద్దుకూరులో భారీ అగ్నిప్రమాదం | 30 thacthed houses burn to fire in devarapally | Sakshi
Sakshi News home page

దుద్దుకూరులో భారీ అగ్నిప్రమాదం

Apr 4 2016 3:28 PM | Updated on Sep 3 2017 9:12 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది.

దేవరపల్లి( పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో చెరువుగట్టుపై నిర్మించుకున్న 40 పూరిళ్లు అగ్ని శిలల్లో దగ్ధమైనట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందినట్టు సమాచారం.

లక్షల రూపాయల్లో భారీగా ఆస్తినష్టం వాటిలినట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా కట్టుకున్న గూడు కళ్లముందే బూడిద కావడంతో బాధితులంతా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement