మూడు తాటాకిళ్లు దగ్ధం | 3 huts burn | Sakshi
Sakshi News home page

మూడు తాటాకిళ్లు దగ్ధం

Apr 14 2017 12:31 AM | Updated on Sep 5 2018 9:47 PM

మూడు తాటాకిళ్లు దగ్ధం - Sakshi

మూడు తాటాకిళ్లు దగ్ధం

భీమలాపురం (ఆచంట) : గ్రామంలో గురువారం గుడాల నాగమణి, గుడాల సుబ్బారావు, గుడాల చిన సత్యనారాయణకు చెందిన మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి.

భీమలాపురం (ఆచంట) :  గ్రామంలో గురువారం గుడాల నాగమణి, గుడాల సుబ్బారావు, గుడాల చిన సత్యనారాయణకు చెందిన మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ.ఆరు లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు బాధితులు చెప్పారు. నాగమణి ఇంట్లో సంభవించిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిపారు. నాగమణి కొద్ది కాలం క్రితం తన ఇంటిని కొబ్బరి కాయల వ్యాపారి సత్యనారాయణకు అద్దెకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఆయనకు చెందిన సుమారు రెండు లక్షల విలువైన కొబ్బరి కాయలు దగ్ధమయ్యాయి. పాలకొల్లు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధితులను సర్పంచ్‌ చింతపర్తి సత్యనారాయణ, ఆర్‌ఐ సన్నిబాబు, వీఆర్‌వో నరసింహరావు పరామర్శించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement