మహబూబ్‌నగర్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ చౌరస్తాలో గల ఏఆర్ ఇన్‌ఫోటెక్ కార్యాలయంలో ఈ నెల 28న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు స్పెక్ట్రం సేవా సంస్థ కార్యదర్శి ఎంఏ రహీమ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
28న ఏఆర్ ఇన్‌ఫోటెక్‌లో జాబ్‌మేళా
Jul 23 2016 11:56 PM | Updated on Sep 4 2017 5:54 AM
మహబూబ్‌నగర్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ చౌరస్తాలో గల ఏఆర్ ఇన్‌ఫోటెక్ కార్యాలయంలో ఈ నెల 28న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు స్పెక్ట్రం సేవా సంస్థ కార్యదర్శి ఎంఏ రహీమ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగుళూరు, హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో 50 మంది ఐటీ కన్సల్టెంట్లు,ట్రైనీ ఐటీ రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసిన ట్లు ఆయన పేర్కొన్నారు.
కంప్యూటర్, ఇంటర్‌నెట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారని, ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లుతో ఏఆర్ ఇన్‌ఫోటెక్ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. వివరాలకు 9985432090 నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
Advertisement
Advertisement