రెండు వోల్వో బస్సులు ఢీ: 27మందికి గాయాలు | 27 injured , Two volvo buses hits at Tirupati | Sakshi
Sakshi News home page

రెండు వోల్వో బస్సులు ఢీ: 27మందికి గాయాలు

Dec 30 2015 6:46 AM | Updated on Sep 3 2017 2:49 PM

రెండు వోల్వో బస్సులు ఢీ: 27మందికి గాయాలు

రెండు వోల్వో బస్సులు ఢీ: 27మందికి గాయాలు

చంద్రగిరి మండలం మల్లవరంలో బుధవారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి.

తిరుపతి: చంద్రగిరి మండలం మల్లవరంలో బుధవారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు మరో 25 మంది అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. శబరిమల నుంచి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఒక డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. క్షతగాత్రులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement