చినలింగాయపాలెం(కాకుమాను): పంట పొలాల్లో వరి పైరు తర్వాత పశువుల మేత కోసం పండించే జనప పంట సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది.
14 అడుగుల జనప మొక్క
Dec 1 2016 10:23 PM | Updated on Sep 18 2018 6:30 PM
చినలింగాయపాలెం(కాకుమాను): పంట పొలాల్లో వరి పైరు తర్వాత పశువుల మేత కోసం పండించే జనప పంట సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది. కాకుమాను మండలం చినలింగాయపాలెంకు చెందిన రైతు వేల్పూరి సోమయ్య మూడు నెలల క్రితం పొన్నూరు నుండి జనప విత్తనాలు కొనుగోలు చేసి తెచ్చి పంటపొలంలో చల్లాడు.
రెండు విత్తనాలను ఇంటి పెరట్లోనూ చల్లాడు. అందులో ఓ మొక్క దాదాపు 14 అడుగులకు మించి పెరగడంతో ఆ మొక్కను గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు. భూమి సారవంతంగా ఉండటం, విత్తనాలలో జన్యుపర లోపాలు జరగటం వలన మొక్కలు ఇలా అధిక ఎత్తు పెరిగే అవకాశం ఉంటుందని మండల వ్యవసాయాధికారిణి సిహెచ్.సునీత తెలిపారు.
Advertisement
Advertisement