వ్యవసాయశాఖలో ఎంపీఈఓ(మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్)ల నియామకం పూర్తయింది.
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయశాఖలో ఎంపీఈఓ(మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్)ల నియామకం పూర్తయింది. 138 మందిని ఎంపీఈఓలుగా నియమించినట్లు జేడీఏ పీవీ శ్రీరామమూర్తి శనివారం తెలిపారు. ఎంపికైన జాబితా వివరాలు నోటీస్ బోర్డులో అతికించారు. అలాగే ఠీఠీఠీ.్చn్చn్ట్చpuట్చఝu.్చp.జౌఠి.జీn అనే వెబ్‌సైట్‌లో కూడా సంప్రదించవచ్చన్నారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్వూ్యలకు 231 మందికి ఆహ్వానించగా అందులో 179 మంది హాజరు కాగా మిగతా 52 మంది గైర్హాజరయ్యారు.
విద్యార్హత క్యాటగిరి, రోస్టర్, మెరిట్ ఆధారంగా 138 మందిని ఎంపిక చేశామన్నారు. అందులో అగ్రికల్చర్ బీఎస్సీ నుంచి నలుగురు, డిప్లోమా అగ్రికల్చర్ నుంచి 50 మంది, డిప్లోమా హార్టికల్చర్ నుంచి ముగ్గురు, మిగతా 81 మంది బీఎస్సీ (బీజెడ్‌సీ) చేసిన అభ్యర్థులు ఎంపికయ్యారన్నారు. త్వరలోనే ఎంపీఈఓలకు పోస్టింగ్‌లు ఇస్తామని తెలిపారు.