బాబు పాలనకు చరమగీతం తథ్యం | 100 party members joined in ysrcp | Sakshi
Sakshi News home page

బాబు పాలనకు చరమగీతం తథ్యం

Mar 10 2017 11:26 PM | Updated on Sep 5 2017 5:44 AM

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పాలనకు చరమగీతం తప్పదని నియోజకవర్గ కోఆరి్డనేటర్‌ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ అన్నారు. మండలంలోని యర్రవరంలో శుక్రవారం కోర్డినేటర్‌ సమక్షంలో గ్రామ ఉపసర్పంచ్‌ దాసరి రమేష్, సహకార సంఘ ఉపాధ్యక్షుడు నీరుకొండ

  • కోఆర్డినేటర్‌ పర్వత ప్రసాద్‌
  • వైఎస్సార్‌సీపీలో వంద మంది చేరిక
  • యర్రవరం (ఏలేశ్వరం) :
    రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పాలనకు చరమగీతం తప్పదని నియోజకవర్గ కోఆరి్డనేటర్‌ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ అన్నారు. మండలంలోని యర్రవరంలో శుక్రవారం కోర్డినేటర్‌ సమక్షంలో గ్రామ ఉపసర్పంచ్‌ దాసరి రమేష్, సహకార సంఘ ఉపాధ్యక్షుడు నీరుకొండ అర్జునరావు, మాజీ ప్రజాప్రతినిధులు భీశెట్టి అప్పలరాజు, రామిశెట్టి వెంకటరమణ, తోట పెద్దిరాజు, బుద్ద లోవబాబుతో పాటు సుమారు వంద మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రసాద్‌ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అన్నివర్గాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అమలు కాని హామీలతో గెద్దెనెక్కిన బాబుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజన్న పాలన రావాలంటే పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిని సీఎం చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అలమండ చలమయ్య , మండల కన్వీనర్‌ బెహరా దొరబాబు, సామంతుల సూర్యకుమార్, ఇజనగిరి ప్రసాద్, సామంతుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement