పిచ్చికుక్క దాడిలో 10మందికి గాయాలు | 10 kids injuried after bitten by stray dog in guntur | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క దాడిలో 10మందికి గాయాలు

Nov 6 2016 2:14 PM | Updated on Sep 4 2017 7:23 PM

పిచ్చికుక్క దాడిలో పది మంది చిన్నారులకు గాయాలయ్యాయి.

గుంటూరు: పిచ్చికుక్క దాడిలో పది మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరులోని తమ్మారెడ్డినగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఇళ్ల వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై ఓ పిచ్చికుక్క దాడి చేసింది. ఇది గుర్తించిన చిన్నారుల కుటుంబ సభ్యులు పిల్లలను చికిత్స నిమిత్తం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.

వారిలో ఒకరి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement