27న టీఈఏ ఆధ్వర్యంలో సదస్సు | Telugu Entrepreneurs Association is organizing an event | Sakshi
Sakshi News home page

27న టీఈఏ ఆధ్వర్యంలో సదస్సు

Aug 25 2016 10:49 PM | Updated on Sep 4 2017 10:52 AM

27న టీఈఏ ఆధ్వర్యంలో సదస్సు

27న టీఈఏ ఆధ్వర్యంలో సదస్సు

తెలుగు వ్యాపారవేత్తల అసోసియేషన్(టీఈఏ) ఆధ్వర్యంలో 'పిచ్ యువర్ బిజినెస్ ఐడియాస్' పేరుతో ఓ సదస్సును నిర్వహిస్తున్నారు.

డల్లాస్: తెలుగు వ్యాపారవేత్తల అసోసియేషన్(టీఈఏ) ఆధ్వర్యంలో 'పిచ్ యువర్ బిజినెస్ ఐడియాస్' పేరుతో ఓ సదస్సును నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 27న డల్లాస్లోని టీఐ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం నూతన వ్యాపారులను, పెట్టుబడిదారులతో అనుసంధానం చేస్తుందని టీఈఏ సభ్యులు వెల్లడించారు.
 
ఈ సదస్సులో 10 ఉత్తమ బిజినెస్ ఐడియాలను ప్రదర్శించనున్నట్లు టీఈఏ వెల్లడించింది. సదస్సులో వెల్లడించే బిజినెస్ ఐడియాలపై నిపుణుల ఫీడ్‌బ్యాక్ ఉంటుందని తెలిపారు. భావసారూప్యత కలిగిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి టీఈఏ నిర్వహించే సదస్సు ఒక వేదికగా పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు.

మేనేజ్డ్ స్టాఫింగ్ వ్యవస్థాపక ఛైర్మన్ అబిద్ హెచ్ అబేడీ,  క్లిక్ సాఫ్ట్ సీజీఓ క్రిష్ణ కూరపాటి, నయా వెంచర్స్ మేనేజింగ్ పార్ట్నర్ దయాకర్ పుస్కూరు, లిగసీ టెక్సాస్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇస్బెత్ నజీరా, టీఈఏ స్ట్రాటజీ టీం ఛైర్మన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement