కిడ్నాప్‌ చేశారని తాళ్లతో కట్టేసిన ఫోటో పంపింది.. | Young woman kidnap in hyderabad | Sakshi
Sakshi News home page

యువతి కిడ్నాప్‌ కలకలం

Feb 27 2018 8:04 AM | Updated on Aug 1 2018 2:15 PM

Young woman kidnap in hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువతి కిడ్నాప్‌ కలకలం రేపింది. ఇన్‌స్పెక్టర్‌ వై.ప్రకాష్‌ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ పటేల్‌నగర్‌కు చెందిన అస్మాబేగం కుమార్తె తబ్బసుమ్‌ బేగం అదే ప్రాంతానికి చెందిన ముస్తఫా అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన అస్మాబేగం తన కుమార్తెకు సల్మాన్‌ అనే యువకుడితో నిశ్చితార్థం జరిపించింది. ఇది నచ్చని తబ్బసుమ్‌ బేగం  రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం తబ్బసుమ్‌ తన తల్లి ఫోన్‌కు వాట్సాప్‌లో తనను కిడ్నాప్‌ చేశారని...తాళ్లతో కట్టేసిన ఫోటో పంపింది. మరి కొద్ది సేపటి తర్వాత తనను బంధించారని ఎక్కడ ఉన్నానో తెలియదంటూ వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడింది. దీంతో అస్మా బేగం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ముస్తఫాపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముస్తఫాను పిలిచి విచారించగా అతని ప్రమేయం లేదని తేలింది. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఆమె షాహిన్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడ గాలించగా ఫలితం కనిపించలేదు. దీంతో రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement