ఒంటరి జీవితం భరించలేక బలవన్మరణం 

Young Gilr Suscide In Anathapur - Sakshi

సాక్షి, రాయదుర్గంటౌన్‌: ఒంటరి జీవితం భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. బళ్లారి జిల్లా రూపనగుడి గ్రామానికి చెందిన లింగన్న, పద్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. స్వగ్రామం నుంచి  25 ఏళ్ల క్రితమే రాయదుర్గం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. కోతిగుట్ట కాలనీలో నివాసముంటున్నారు. జ్యోతి తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం మృతి చెందారు. ఇద్దరు అక్కలకు వివాహం కాగా.. సోదరుడు స్వగ్రామానికి వెళ్లి పొలం పనులు చేసుకుంటున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న జ్యోతి స్వగ్రామానికి వెళ్లలేక రాయదుర్గంలోనే ఓ కంప్యూటర్‌ ఇన్‌స్టిట్ట్యూట్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవిస్తోంది. నెల రోజుల నుంచి పనికి కూడా వెళ్లడం లేదు. అక్కలు, సోదరుడు ఎవరూ తనను పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై.. ఒంటరి జీవితం భరించలేక మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top