విషాన్ని పీల్చేద్దామనుకుంటే.. పేలుడు

Woman Dies After Explosion In Mouth In UP - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చికిత్సలో భాగంగా నోట్లో వేసిన పైపు పేలడంతో మహిళ మృతి చెందింది. వివరాలు.. బాధితురాలు విషం తాగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. హుటాహుటిన ఆమెను అలీఘడ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వెంటనే చికిత్స ప్రారంభించిన డాక్టర్లు..విషాన్ని పీల్చడానికి బాధితురాలి నోటిలో పైపు వేసారు. అయితే క్షణాల్లోనే అది పేలడంతో ఆమె మృత్యువాత పడింది.

కాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన గురించి డాక్టర్లు మాట్లాడుతూ.. మృతురాలు సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ తాగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే నోట్లో పైపు వేయగానే అందులోని ఆక్సీజన్‌తో చర్య జరగడంతో పేలుడు సంభవించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఘటనకు గల కారణాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు ఆస్పత్రి అధికార ప్రతినిధి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top