
భర్త ఇంటిముందు నిరసన తెలుపుతున్న జ్యోత్స్న
శ్రీకాకుళం , కాశీబుగ్గ: భార్యా భర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నా.. పోలీసులు, కుల పెద్దలు, కుటుంబసభ్యులు వీటిని పరిష్కరించకపోవడంతో భర్త ఇంటి ముందు భార్య నిరసన తెలిపారు. పలాస పట్టణంలో కొత్తకోట జ్యోత్స్న తన పిల్లలతో భర్త జగన్ ఇంటి ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఇది వరకు అత్తమామలు ఇంటి ముందు నిరసన తెలిపినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఎస్‌ఐ ప్రసాదరావు బాధితురాలి ఇంటికి చేరుకుని సమస్య పరిష్కరించారు.