నా భర్త యువతులను మోసం చేస్తున్నాడు అరెస్టు చేయండి.. | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో యువతులకు వల

Published Fri, Jul 19 2019 7:56 AM

Wife Complaint on Husband in Tamil nadu - Sakshi

చెన్నై,వేలూరు: ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భార్య ఫిర్యాదు చేసిన సంఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే వేలూరు జిల్లా తిరుపత్తూరు పుదుపేట వీధికి చెందిన కౌసల్య గతంలో బెంగుళూరులో  ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేసేది. ఆ సమయంలో తిరువణ్ణామలై జిల్లా సెంగం తాలుకా తానియంబాడి గ్రామానికి చెందిన వాంజినాధన్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో 2013లో బెంగళూరులోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవడంతో బెంగుళూరులోనే నివాసం ఉంటున్నారు. అయితే కొద్ది కాలానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో 2015లో తిరుపత్తూరుకు వెళ్లారు. తమ జీవనాధారం గోల్డ్‌ కవరింగ్‌ దుకాణం నిర్వహించేవారు.

అయితే కొద్ది నెలల్లోనే వ్యాపారంలో నష్టం వచ్చిందంటూ తన 55 సవర్ల బంగారు నగలను వాంజినాధన్‌ తాకట్టుపెట్టాడని కౌసల్య తెలిపింది. అంతేకాకుండా తన బంధువల వద్ద రూ.7 లక్షల వరకు అప్పు చేసి వాటిని కూడా తిరిగి చెల్లించలేదని, దీంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేదని వివరించింది. గత ఆరు నెలల క్రితం తానియంబాడికి వెళ్లిన వాంజినాధన్‌ తిరిగి ఇంటికి రాలేదు. విషయం తెలుసుకోవడానికి ఇంటికి వెళ్తే తన అత్త దుర్భాషలాడింది ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామంలో వాంజినాధన్‌ గురించి విచారించగా.. ఇది వరకే అతనికి వివాహమైందని తెలిసిందన్నారు. నగదు, బంగారం కోసం యువతులను ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు తెలిసిందని చెప్పింది. దీనిపై తానియంబాడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో తనను నడి రోడ్డుపై దాడిచేసి బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయింది. సబ్‌ కలెక్టర్‌ విచారణ జరిపి యువతులను ప్రేమ పేరుతో మోసం చేస్తున్న వాంజినాథన్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కౌసల్య కోరింది. స్పందించిన సబ్‌కలెక్టర్‌ విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించడంలో తిరుపత్తూరు టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement