కట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య | Wife Attempts Suicide For Husband harassment In Ramagundam | Sakshi
Sakshi News home page

కట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య

Jul 14 2019 10:32 AM | Updated on Jul 14 2019 10:32 AM

Wife Attempts Suicide For Husband harassment In Ramagundam - Sakshi

భర్తతో నవ్య(ఫైల్‌)  

సాక్షి, వేములవాడ(కరీంనగర్‌) : కట్నం వేధింపులకు వివాహిత కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేములవాడ అర్బన్‌ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన తాడెం అంజయ్య– సత్తవ్వల కుమార్తె తాడెం సరళ ఊరాఫ్‌ అన్నవేని నవ్య(24)ను ఐదేళ్లక్రితం సిరిసిల్ల మండలంలోని చంద్రపేటకు చెందిన అన్నవేణి మల్లేశంకిచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో కట్నకానుకలు అందించారు. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. నవ్య తమ్ముడికి ఆమె అత్తవారి గ్రామం నుంచి అమ్మాయినిచ్చి ఏడాది క్రితం వివాహం జరిపించారు. ‘

మనకంటే.. మీ తమ్ముడికి ఎక్కువ కట్నం ఇచ్చారు’ అంటూ నవ్యను భర్త మల్లేశం వేధించడం ప్రారంభించాడు. వేధింపులు తాళలేక ఆర్నెల్లక్రితం కొంతడబ్బు  పుట్టింటి నుంచి తీసుకొచ్చింది. అయినప్పటికీ మరింత డబ్బుకావాలని మల్లేశం వేధించడంతో నవ్య మూడ్రోజుల క్రితం పుట్టినిల్లయిన రుద్రవరంకు వచ్చింది. శనివారం మధ్యాహ్నం భర్తతో ఫోన్లో మాట్లాడిన నవ్య ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుం ది. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరా బాద్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందింది. పట్టణ సీఐ వెంకటస్వామి విచారణ జరిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement