శీతలపానీయంలో విషం కలిపి తాగించి..

Wife And Huband Quarreled Killed Herself Wife And Two Children In Vinukonda - Sakshi

సాక్షి, వినుకొండ : వినుకొండ మండలం నీలగంగవరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  గ్రామానికి చెందిన రసూల్, సలోమి(35) దంపతులు బతుకు దెరువు కోసం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండలం వెల్లటూరు పాలేనికి కొన్నేళ్ల కిందట వలస వెళ్లారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బుధవారం సలోమి తన ఇద్దరు కుమారులైన విలియమ్‌ కేర్‌(12), బిలీగ్రామ్‌(8)లకు శీతలపానీయంలో విషం కలిపి తాగించి, తాను తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి,  శుక్రవారం మృతదేహాలను స్వగ్రామమైన నీలగంగవరం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సలోమి కుటుంబ సభ్యులను వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా శ్రీనివాసరావు పరామర్శించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top