వరంగల్‌ విషాదానికి కారణం ఇదే!

Warangal Fire Accident, Bhadrakali Fireworks Has No Permit - Sakshi

బాణాసంచా తయారీ పర్మిట్‌ ముగిసింది

అయినా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల నిల్వ

సాక్షి, వరంగల్‌ (అర్బన్‌): భద్రకాళీ ఫైర్‌వర్క్స్‌లో పేలుడు ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు దు​ర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. భద్రకాళీ ఫైర్‌వర్క్స్‌కు బాణాసంచా తయారీకి పర్మిషన్‌ లేదని తెలిపారు. 2017లోనే దీని పర్మిట్‌ ముగిసిందని అన్నారు.

పర్మిషన్‌ లేకుండా పేలుడు పదార్థాలు విక్రయించడం, తయారు చేయడం క్రిమినల్‌ చర్య అని అన్నారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top