
ప్రతీకాత్మక చిత్రం
అందరూ చూస్తుండగానే రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో రవికుమార్ ప్రాణాలు తీసుకున్నాడని..
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం లేక నిరాశ చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జరగడం కలకలం రేపింది. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైట్ కాలేజీలో రవి కుమార్ (32) ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ.. సరైన ఉద్యోగం లేకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. అందరూ చూస్తుండగానే రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో రవికుమార్ ప్రాణాలు తీసుకున్నాడని స్థానికులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అదే కాలేజీలో జెండా కూడా ఎగురవేశామని అన్నారు.