షేక్ సద్దాంను హత్య చేసిన నిందితుల అరెస్ట్‌

Two Men Arrested For Saddam Killing Case In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : నాంపల్లిలో షేక్ సద్దాం అనే యువకుడి తల నరికిన హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన మహ్మద్‌ గౌస్‌. మహ్మద్‌ ఇమ్రాన్‌లను నిందితులుగా చేర్చారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని, వారు తెచ్చిన తలను, ఒక బైక్ ను, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకేసు పూర్తి వివరాలను నాంపల్లి పోలీసుస్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఇంచార్జీ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు వెల్లడించారు.

(చదవండి : నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..)

ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం... మహమ్మద్ గౌస్, మహమ్మద్ ఇమ్రాన్ లు తమ చిన్నమ్మ కూతురు రజియా మృతికి కారణమనే సద్దాంపై పగ పెంచుకున్నారు. రజియాతో సహజీవనం చేసిన సద్దాంమే ఆమె మృతి కారణం అని కేసు నమోదు అయ్యింది. రజియా హత్య అనంతరం ఆమె ఇద్దరు పిల్లల బాగోగులను చూస్తానని సద్దాం అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ తర్వాత వారి గురుంచి పట్టించుకోలేదు. పలుమార్లు పెద్దలు అడిగినా సద్దాం నిర్లక్ష్యం చేశారు. దీంతో రజియా పెద్దమ్మ కొడుకులు అయిన గౌస్, ఇమ్రాన్ లు సద్దాంపై కోపం పెంచుకున్నారు.

శనివారం నాంపల్లికి వచ్చిన సద్దాంకు.. ఓ టీ కొట్టు వద్ద గౌస్, ఇమ్రాన్ లు ఎదురు రాగా రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. అప్పటికే ఉన్న కోపంతో పాటు సద్దాం నిన్న వ్యవరించిన తీరుతో వెంటనే ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే స్థానిక మద్యం షాప్ లో మద్యం కొనుగోలు చేసి హత్యకు ప్లాన్ చేశారు.  కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో మాటు వేశారు. స్నేహితుడు శివ ఇంట్లో సద్దాం ఉన్నాడని తెలుసుకుని అదును కోసం వేచి చూసారు. శివ ఇంటి నుంచి సద్దాం బయటకు రాగానే గౌస్, ఇమ్రాన్ లు కత్తితో దాడికి దిగారు. తలను మొత్తం నరికి మొండెం నుంచి వేరు చేశారు. అక్కడి నుంచి బైక్ పై నేరుగా నాంపల్లి పోలీసు స్టేషన్ కు తలతో పాటు కత్తితో వెళ్లి నిందితులు లొంగిపోయారు. సద్దాం హత్యలో ఇద్దరికి పాత్ర ఉందని తేల్చిన పోలీసులు గౌస్, ఇమ్రాన్ లపై 302, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు నల్లగొండ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top