మోడల్‌ని వేధించిన ఇద్దరు అరెస్ట్‌ | Two Accused Arrested In Model Molesting In Bhopal | Sakshi
Sakshi News home page

మోడల్‌ని వేధించిన ఇద్దరు అరెస్ట్‌

Apr 25 2018 10:06 AM | Updated on Oct 8 2018 3:19 PM

Two Accused Arrested In Model Molesting In Bhopal - Sakshi

భోపాల్‌ : రోడ్డుపై వెళ్తున్న మోడల్‌ని వేధించిన ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇండోర్‌లో ఆదివారం సాయంత్రం యాక్టివాపై వెళ్తున్న మోడల్‌ను వెంబడించిన నిందితులు ఆమెని దూషిస్తూ, స్కర్ట్‌ లాగడానికి యత్నించారు. దీంతో అదుపు తప్పిన వాహనంపై నుంచి కింద పడిపోవడంతో ఆమెకి గాయాలయ్యాయి. తనపై దాడికి యత్నించిన వారి గురించి ట్విటర్‌ ద్వారా ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ ఘటనపై స్పందిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఘటనా స్థలంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని 60సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. లక్కీ, బంటి అనే ఇద్దరు యువకులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నామని.. బాధితురాలు వారిని గుర్తుపట్టడంతో అరెస్టు చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించినందుకు అధికారులకు 20వేల రూపాయల రివార్డు అందజేయనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిందితుల అరెస్ట్‌పై స్పందించిన ఆమె ట్విటర్‌లో పోలీసు శాఖకు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

చదవండి : మోడల్‌కు షాకింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement