‘సూర్య .. ఝాన్సీని ట్రాప్‌ చేశాడు’

TV Actress Jhansi Suicide Case Police Probe Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంచలనం రేపిన టీవీ సీరియల్‌ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తోంది. ఝాన్సీ ప్రియుడు సూర్యను ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్య పలు కొత్త విషయాలు బయటపెట్టాడు. ఝాన్సీకి బాబి, గిరి అనే ఇద్దరు ఫోటో షూట్‌ చేసేవారని సూర్య తెలిపాడు. అయితే వారిద్దర్నీ నమ్మొద్దని ఝాన్సీని తాను పలుమార్లు హెచ్చరించానన్నాడు. సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని వారు ఆమెను మోసం చేశారని సూర్య తెలిపాడు. (అనుమానమే అవమానమనుకుంది)

గిరి పలుమార్లు ఇబ్బంది పెట్టాడని ఝాన్సీకి తనకు చెప్పిందన్నాడు. దాంతో గిరికి ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చానన్నాడు. సినిమా ఆఫర్లు తగ్గడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని సూర్య పోలీసుల విచారణలో వెల్లడించాడు. సూర్య చెప్పిన దాని ప్రకారం బాబి, గిరిని కూడా పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు సమాచారం.

సూర్య ఝాన్సీని ట్రాప్‌ చేశాడు : దుర్గ
మధుతో కలిసి సూర్య ఝాన్సీని ట్రాప్‌ చేశాడని ఆమె సోదరుడు దుర్గ ఆరోపించారు. సూర్య ముందు మధును ప్రేమించాడని తెలిపారు. ఈ క్రమంలో మధునే.. ఝాన్సీని సూర్యకు పరిచయం చేసిందన్నాడు. ఆ తరువాత సూర్య మధును వదిలేసి ఝాన్సీని ప్రేమించాడని వెల్లడించాడు. మధునే ఝాన్సీని మిస్‌గైడ్‌ చేసిందని దుర్గ ఆరోపించాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top