ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతి | Three Maoists Killed In Odisha Encounter | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

Mar 26 2018 4:35 PM | Updated on Mar 28 2019 5:07 PM

Three Maoists Killed In Odisha Encounter - Sakshi

సాక్షి, ఒడిశా: మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వద్ద ఆదివారం అర్థరాత్రి పోలీసులు,మావోలు ఎదురుకాల్పులకు దిగారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో కోరాపుట్‌ జిల్లాలోని తొల్లగోమండి గ్రామ సమీపంలో ఉన్న డొక్రిఘాట్‌ అడవి ప్రాంతంలోకి పోలీసులు చేరుకున్నారు.

పోలీసుల అలికిడి గమనించిన మావోయిస్టులు ఎదురుకాల్పులకు దిగారు. కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా మిగిలివారు తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో నాలుగు మందుగుండు సంచులు, 303 రైఫిళ్లు, 10 కిట్‌ బ్యాగులు, మావోయిస్టు పార్టీకి చెందిన సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం అటవి ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయాని  తెలిపారు. చనిపోయిన ముగ్గురూ మహిళా మావోయిస్టులే. అయితే వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement