పదవ తరగతి విద్యార్థి అత్మహత్య | Tenth Class Student Commits Suicide in YSR Kadapa | Sakshi
Sakshi News home page

పదవ తరగతి విద్యార్థి అత్మహత్య

Feb 11 2020 1:28 PM | Updated on Feb 11 2020 1:28 PM

Tenth Class Student Commits Suicide in YSR Kadapa - Sakshi

మృతి చెందిన నరసింహరెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, పెండ్లిమర్రి: మండలంలోని మాచునూరు గ్రామ పంచాయితీలోని అరవేటిపల్లె గ్రామానికి అరవేటి నరసింహరెడ్డి(15) అనే విద్యార్థి సోమవారం అత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు... నరసింహరెడ్డి వెల్లటూరులోని 10వ తరగతి చదువుతుండేవాడు. తరచూ తలనొప్పి ఉండడంతో, ఒక వైపు పదవ తరగతి పరీక్షలు దగ్గర పడడంతో చదవాలంటే కష్టాంగా ఉందని చెబుతుండేవాడు. సోమవారం ఉదయం ఇంటి సమీపంలో ఉన్న సంపద సృష్టి కేంద్రం(డంపింగ్‌ యార్డు)లో తాడుతో మెడకు ఊరి వేసుకొని చనిపోయాడస. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించే సరికే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని పోస్టుమాస్ట నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. మృతునికి తల్లి, చెల్లెలు ఉన్నారు. తండ్రి బాస్కర్‌రెడ్డి అనార్యోగకారణంగా తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయాడు. కుమారుడు మృతి చెందడంతో ఆకుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement