టెంపో ఢీకొని ఇద్దరి దుర్మరణం | tempo collided..two dead | Sakshi
Sakshi News home page

టెంపో ఢీకొని ఇద్దరి దుర్మరణం

Mar 5 2018 7:51 AM | Updated on Apr 3 2019 8:03 PM

tempo collided..two dead - Sakshi

నుజ్జునుజ్జు అయిన ద్విచక్ర వాహనం, మృతులు రామక్రిష్ణప్ప, జయమ్మ

పెద్దతిప్పసముద్రం : మండలంలోని టి.సదుం పంచా యతీ చెన్నరాయునిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని టెంపో ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసుల కథ నం మేరకు.. కర్ణాటక సరిహద్దులోని ఉప్పుకుంటపల్లికి చెందిన జయమ్మ (54) సమీపంలోని అంకాలమడుగు గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని సమీప బంధువు రామక్రిష్ణప్ప(58)తో కలిసి ద్విచక్ర వాహనంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న చెన్నరాయనిపల్లి సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న టెంపో ఢీకొని వెళ్లిపోయింది.

ఈ ప్రమాదంలో జయమ్మ, రామక్రిష్ణప్ప తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ విషయం తెలుసుకున్న మృతుల బంధువులు అక్కడికి చేరు కుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రవికుమార్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement