సీరియల్‌ నటి లలిత అదృశ్యం | Telugu TV Serial actress Lalitha Was Missing | Sakshi
Sakshi News home page

సీరియల్‌ నటి లలిత అదృశ్యం

Jun 27 2019 3:57 AM | Updated on Jun 27 2019 3:57 AM

Telugu TV Serial actress Lalitha Was Missing - Sakshi

హైదరాబాద్‌: తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించే లలిత (25) అనే మహిళ కనిపించకుండా పోయింది. అమీర్‌పేట లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న లలిత ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయిం దని ఆమె తల్లి వెంకటలక్ష్మి బుధవారం ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలానికి చెందిన లలిత (25)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఏడేళ్ల కుమార్తె ఉంది. లలిత ప్రస్తుతం భర్తతో దూరంగా ఉంటోంది. కూతురుని తల్లిదం డ్రుల వద్ద ఉంచి అమీర్‌పేట రాజరాజేశ్వరీ ఉమెన్స్‌ హాస్టల్‌లో చేరి తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. రోజూ రాత్రి ఫోన్‌ చేసి తల్లితో పాటు కుమార్తెతో మాట్లాడేది.

ఈ నెల 17న ఫోన్‌ చేయకపోవడంతో తల్లి లలితకు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వచ్చింది. ఇలా వారం నుంచి లలిత ఫోన్‌ స్విచాఫ్‌ అని రావడంతో వెంకటలక్ష్మి మరో కుమార్తె రామాంజనమ్మతో కలిసి నగరానికి వచ్చి హాస్టల్‌లో ఆరా తీసింది. లలిత 2 నెలల క్రితమే హాస్టల్‌ నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాని అనే వ్యక్తి సీరియల్‌లో నటించే అవకాశం కల్పిస్తానని చెప్పి నగరానికి తీసుకువచ్చాడని వెంకటలక్ష్మి పోలీసులకు తెలిపింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ మురళీ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement