టీచర్‌కు అయిదేళ్ల జైలు

Teacher who made boy clean human excreta gets jail - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థితో మలమూత్రాలు ఎత్తించిన నేరంపై ఓ మున్సిపల్‌ టీచర్‌కు తమిళనాడు కోయంబత్తూరు కోర్టు శుక్రవారం అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. నామక్కల్‌ జిల్లా రామాపురంపుదూర్‌ మున్సిపల్‌ పాఠశాలలో 2,3వ తరగతులకు ఒకే గదిలో క్లాసులు నిర్వహించేవారు. స్కూలుకు సమీపంలో నివసిస్తున్న వీరాస్వామి కొడుకు శచీంద్రన్‌ 2015లో 2వ తరగతి విద్యార్థిగా ఉన్నకాలంలో, తనకు తెలియకుండానే మలమూత్రాలను విసర్జించాడు.

క్లాస్‌ టీచర్‌ విజయలక్ష్మి (35) శచీంద్రన్‌ చేత మలమూత్రాలు ఎత్తించివేసినట్లు అదే ఏడాది నవంబరు 12న వీరాస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద టీచర్‌ విజయలక్ష్మిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసుపై నామక్కల్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్లుగా విచారణ జరిపి టీచర్‌ విజయలక్ష్మికి అయిదేళ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఆమెను కోయంబత్తూరు జైలుకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top